News August 30, 2025

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే: కోమటిరెడ్డి

image

TG: రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై గొప్పగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో వివరణ ఇవ్వాలని, ఆయన రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లేనని తెలిపారు. కమిషన్ నివేదికకు భయపడే KCR మళ్లీ కోర్టుకు వెళ్లారన్నారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకు యూరియా పేరుతో BRS రాజకీయం చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు.

Similar News

News August 31, 2025

పోర్న్ సైట్‌లో మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు

image

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు పోర్న్ సైట్‌లో దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపింది. 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆ సైట్‌లో మెలోనీతోపాటు పలువురు ప్రముఖుల ఫొటోలూ ఉన్నాయి. తనతోపాటు చాలామంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి చర్యలు చాలా అసహ్యకరం. బాధిత మహిళలందరికీ నా మద్దతు ఉంటుంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.

News August 31, 2025

మోదీ-ట్రంప్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా?

image

మోదీకి జూన్ 17న కాల్ చేసిన ట్రంప్.. భారత్-పాక్ సీజ్‌ఫైర్ గురించి ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తాను యుద్ధాన్ని ముగించానని, పాక్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబోతుందని చెప్పినట్లు రాసుకొచ్చింది. దాన్ని మోదీ తిరస్కరించారని, సీజ్‌ఫైర్‌లో మూడో దేశం ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారని తెలిపింది. నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసేందుకు ఇష్టపడకపోవడంతో ట్రంప్ అలిగినట్లు వివరించింది.

News August 30, 2025

ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు: CM

image

AP: కుప్పానికి కృష్ణమ్మను తీసుకొచ్చేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పారు. 738 కి.మీ. దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో ప్రజల్లో ఆనందం చూసి ఎంతో సంతోషం కలిగిందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజని తెలిపారు.