News March 22, 2024
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే?
CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే విద్యాశాఖ మంత్రి ఆతిశీ, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్‌కు ఆతిశీ అత్యంత సన్నిహితురాలు. సౌరభ్ సైతం చురుగ్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనే పేరుంది. వీరికి తోడు కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా వినిపిస్తోంది.
Similar News
News November 2, 2024
మార్చి 27న లూసిఫర్-2 రిలీజ్
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా L2:ఎంపురాన్ మూవీ తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్‌లాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టొవినో, దుల్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా లూసిఫర్‌ను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు.
News November 2, 2024
14 నుంచి వార్డెన్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
TG: సంక్షేమ హాస్టళ్లలో వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.10.30 నుంచి సా.5 వరకు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో పరిశీలన ఉంటుందన్నారు. అనివార్య కారణాలతో హాజరుకాలేని వారికి డిసెంబర్ 2-4 రిజర్వుడేగా ప్రకటించామన్నారు. మొత్తంగా 581 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
వెబ్సైట్: https://www.tspsc.gov.in/
News November 2, 2024
నేటి నుంచి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం
AP: సీఎం చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ‘గుంతల రహిత రోడ్ల నిర్మాణం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 15 నాటికి రూ.860 కోట్లతో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లకు ఇరువైపులా కంప చెట్లను కొట్టేయడంతోపాటు కల్వర్టుల నిర్మాణాన్ని చేపడుతుంది. ఇందుకోసం SRM వర్సిటీ, IIT తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.