News March 18, 2025
మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

సెల్ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT
Similar News
News November 22, 2025
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భిణులు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఎక్కువ ఉప్పు తింటే మరికొందరు తక్కువ ఉప్పు తింటారు. కానీ గర్భిణులు రోజుకి 3.8గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు.
News November 22, 2025
APPLY NOW: సింగరేణిలో 82 పోస్టులు

సింగరేణిలో 82 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com
News November 22, 2025
కులశేఖర పడి కథ మీకు తెలుసా..?

12 మంది ప్రసిద్ధ ఆళ్వార్లలో కులశేఖరాళ్వార్ ఒకరు. ఆయన కేరళను పాలించిన ఓ క్షత్రియ రాజు. ఆయన రాజు అయినప్పటికీ దాస్యభక్తికి ప్రతీకగా నిలిచాడు. మహావిష్ణువుపై అచంచల భక్తితో ‘పెరుమాళ్ తిరుమొళి’ అనే పాటలు రచించారు. ‘స్వామీ! నీ సన్నిధిలో కనీసం గడపగానైనా ఉండిపోవాలి’ అని కోరుకున్నారు. కోరుకున్నట్లే చివరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో కులశేఖర పడిగా మారారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


