News October 6, 2024

మోదీ అలా చేస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తా: కేజ్రీవాల్

image

ప్రధాని మోదీకి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీగా ఇస్తోంది.

Similar News

News October 24, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

image

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల క్యాన్సర్ తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరికాయ, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

News October 24, 2025

ఈ రోజు రాత్రి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

News October 24, 2025

మల్లె సాగు – అనువైన రకాలు

image

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.