News November 17, 2024
మోదీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: సిద్దరామయ్య
కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బును మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని PM మోదీ చేసిన ఆరోపణలపై కర్ణాటక CM సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధాని ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. ‘మోదీ ఇష్టానుసారంగా అబద్ధాలాడి వెళ్లిపోతారు. తను చెప్పిన మాటలకు ప్రూఫ్ చూపించగలరా? నా సవాలు స్వీకరిస్తారా? ఆయనకెందుకు భయం?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 17, 2024
ప్రధాని మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీకి నైజీరియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ను ఆయనకు ప్రకటించింది. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు పొందిన విదేశీ ప్రముఖుడు మోదీ మాత్రమే కావడం విశేషం. ఇది ఆయనకు అందిన 17వ విదేశీ పురస్కారం. కాగా మోదీ నైజీరియా నుంచి జీ20 లీడర్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్తారు. ఆ తర్వాత గయానాలో పర్యటిస్తారు.
News November 17, 2024
ఢిల్లీ మంత్రి రాజీనామా
ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్. అరవింద్ కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి పదవి ఈయనకే వస్తుందనే ప్రచారం కూడా జరిగింది.
News November 17, 2024
తొలి అరగంట మినహా ‘కంగువా’ అద్భుతం: జ్యోతిక
‘కంగువా’కు మిక్స్డ్ టాక్ వస్తున్న వేళ సూర్య భార్య జ్యోతిక తన అభిప్రాయాన్ని SMలో వెల్లడించారు. ‘మూవీ తొలి అర గంట నిజంగానే బాలేదు. సౌండ్ ఇబ్బందికరంగా ఉంది. అది మినహాయిస్తే ఈ సినిమా అద్భుతం. సూర్య నటన, కెమెరా వర్క్ గొప్పగా ఉంది. నెగటివ్ రివ్యూస్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. రొటీన్ స్టోరీస్, అమ్మాయిల వెంట పడటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ను దాటి వారి మెదడు ఎదగలేదని అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.