News June 10, 2024
‘మోదీ గెలిస్తే గుండు కొట్టించుకుంటా’.. సవాల్‌పై ఆప్ నేత యూటర్న్

మోదీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఎన్నికల ఫలితాల ముందు సవాల్ చేసిన ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అన్న మాటను నిలబెట్టుకునేందుకు నిరాకరించారు. మోదీ కూటమి సాయంతో సర్కారు ఏర్పాటు చేయడమే అందుకు కారణమట. ఇప్పటికీ అన్న మాట మీదే నిలబడతానన్న సోమ్‌నాథ్.. మోదీ సొంతంగా గెలవనందున ఇది ఆయన విజయం కాదన్నారు. కాబట్టి తాను గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News September 13, 2025
ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఖరీదైన బొటాక్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్తుంటే మరికొందరు ఫేస్ టేపింగ్ చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫేస్ టేపింగ్ ఎక్కువగా చేసుకుంటే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చర్మం అందంగా, యవ్వనంగా మెరుస్తుందని సూచిస్తున్నారు.
News September 13, 2025
సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.
News September 13, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,43,000గా ఉంది. రెండు రోజుల్లో కేజీ సిల్వర్‌పై రూ.3వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.