News April 10, 2024

మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: కిషన్ రెడ్డి

image

TG: మరోసారి మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ది చెందుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంచింది మోదీనే అన్నారు. ఆయన హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు.

Similar News

News April 9, 2026

పాక్ నమ్మదగిన మీడియేటర్ కాదు: ఇజ్రాయెల్

image

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశామని పాకిస్థాన్‌ చెప్పుకుంటోంది. అయితే మీడియేటర్‌గా ఆ దేశ విశ్వసనీయతపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సందేహాలు వ్యక్తం చేశారు. పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని చెప్పారు. వాషింగ్టన్ సొంత కారణాలతో వ్యూహాత్మకంగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో హమాస్‌తో డీల్ కోసం ఖతర్, తుర్కియేను US ఎలా వాడుకుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

News April 9, 2026

10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

image

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It

News April 9, 2026

ఇది విన్నారా.. పాక్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలట!

image

పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా డిమాండ్ చేస్తోంది. ‘అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో పాక్ కీలక పాత్ర పోషించింది. చర్చలకు అవసరమైన పరిస్థితులను సృష్టించింది. ఇరుపక్షాలకు నమ్మకమైన సమాచార దూతగా వ్యవహరించింది’ అని ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతా బానే ఉంది కానీ.. ఈ శాంతి బహుమతి కోసం విశ్రాంతి లేకుండా ప్రయత్నించిన ట్రంప్ ఊరుకుంటారా?