News January 8, 2025
ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు

AP: దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే సర్కారు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఎన్డీయే బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నా. పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తాం. ఇక నుంచి అన్నీ జయాలే. అపజయాలుండవు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 28, 2025
‘రబీలో యూరియా కొరత ఉండకూడదు’

AP: ఖరీఫ్‌లో ఎదురైన యూరియా సమస్యలు.. ప్రస్తుత రబీ సీజన్లో తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గ్రోమోర్ కేంద్రాల్లో యూరియా కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.91 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, పోర్టుల్లో మరో 1.35 లక్షల టన్నులు ఉందని.. దీన్ని అన్ని జిల్లాలకు అవసరం మేరకు తరిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 28, 2025
SNBNCBSలో ఫ్యాకల్టీ పోస్టులు

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (SNBNCBS) ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ(అప్లైడ్ సైన్స్/ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.78,800, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,23,100 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.bose.res.in/
News November 28, 2025
టాక్సిక్ వర్క్ కల్చర్‌లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.


