News November 10, 2024
డిసెంబర్ 31లోగా చేయకపోతే..
ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల ప్రొఫైల్‌ను రూపొందించడం కోసం పాన్ సమాచారాన్ని వాడుతుండటంతో ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది. లింక్ చేయని పక్షంలో పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
Similar News
News November 13, 2024
దేశంలో 3 లక్షల బీటెక్ సీట్లు మనవే!
బీటెక్ సీట్లలో AP, TG ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14.90 లక్షల సీట్లు ఉండగా ఇరు రాష్ట్రాల్లో కలిపి 3.10 లక్షల సీట్లు ఉండటం విశేషం. ఏపీలో 1.83 లక్షల సీట్లు, తెలంగాణలో 1.45 లక్షల సీట్లు ఉన్నాయి. 3.08 లక్షల సీట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం సీట్లలో ఈ 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 42.80 శాతం సీట్లు ఉన్నాయి. AICTE పరిమితి ఎత్తివేయడంతో దక్షిణాదిలో వచ్చే ఏడాది సీట్లు మరింత పెరగొచ్చు.
News November 13, 2024
ఆ మ్యాచ్ గురించి నేను, కోహ్లీ ఇప్పటికీ చింతిస్తుంటాం: KL రాహుల్
2016 IPL ఫైనల్లో SRHతో సునాయాసంగా గెలిచే స్థితి నుంచి RCB ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ విషయంలో తాను, విరాట్ నేటికీ చింతిస్తుంటామని క్రికెటర్ KL రాహుల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా ఇద్దరిలో ఒకరు ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే ఫలితం వేరేలా ఉండేది. టేబుల్ అట్టడుగు నుంచి వరుసగా 7మ్యాచులు గెలిచి ఫైనల్స్‌కు వచ్చాం. బెంగళూరులో ఫైనల్. గెలిచి ఉంటే అదో కల నిజమైన సందర్భం అయ్యుండేది’ అని పేర్కొన్నారు.
News November 13, 2024
IFS సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది: మహేశ్ భగవత్
TG: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 పరీక్షల్లో ఆలిండియా 131వ ర్యాంకు సాధించిన సాయి చైతన్య జాదవ్‌ను రాష్ట్ర అదనపు డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ‘సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది. 2022లో సివిల్స్ పరీక్షలకి, ఈ ఏడాది IFS ఇంటర్వ్యూకి అతడిని గైడ్ చేశాను. నేను ఆదిలాబాద్ SPగా ఉన్న సమయంలో సాయి తండ్రి గోవిందరావు నాతో కలిసి పనిచేశారు. ఆయన కుమారుడు ఇలా IFSకి సెలక్ట్ అవడం చాలా సంతోషం’ అని పేర్కొన్నారు.