News January 11, 2025
మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం: కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపైన జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. ‘మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.
Similar News
News December 1, 2025
SC కమిషన్ సెక్రటరీ కుమార్తె అనుమానాస్పద మృతి

రాష్ట్ర SC కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మాధురి అనుమానాస్పదంగా మృతి చెందారు. బేతంచెర్ల మం. బుగ్గానిపల్లె తండాకు చెందిన ఆమె రాజేశ్ నాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెను 3 నెలల క్రితం తల్లిదండ్రులు తీసుకెళ్లారని రాజేశ్ తెలిపారు. మరో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని, గర్భిణి అని చూడకుండా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేశ్ ఆరోపించడం సంచలనంగా మారింది.
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


