News September 30, 2024
పాకిస్థాన్ అలా చేసి ఉంటే..: రాజ్‌నాథ్ సింగ్

J&K ఎన్నికల ప్రచారంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ గాని భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే IMFని కోరుతున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారిందని విమర్శించారు.
Similar News
News December 20, 2025
టంగుటూరులో హత్యకు కారణం అదేనా..?

టంగుటూరులోని HDFCలో సెక్యూరిటీ గార్డ్ రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బు కోసమే హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య పర్యవేక్షణలో పోలీసులు హత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. కాగా పోలీసులు పూర్తి వివరాలు వెళ్లడించాల్సి ఉంది.
News December 20, 2025
బంగ్లాను షేక్ చేస్తా.. గర్ల్‌ఫ్రెండ్‌తో హాదీ మర్డర్ నిందితుడు

ఉస్మాన్ హాదీ <<18610392>>హత్యతో<<>> బంగ్లా భగ్గుమంటోంది. దీంతో పోలీసులు మర్డర్ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఫైజల్ అనే యువకుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. హాదీ హత్యకు ముందు అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ‘బంగ్లాను షేక్ చేస్తా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత కొన్ని గంటలకే మరో ఇద్దరితో కలిసి అతడిపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ హాదీ ఒక చెవి నుంచి దూరి మరో చెవిలో నుంచి బయటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
News December 20, 2025
అనకాపల్లికి సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ అనకాపల్లి(D) తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారు. బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో TDP నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు Dy.CM పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.


