News June 12, 2024

పాండ్య విఫలమైతే జట్టుపై ప్రభావం పడేది: బౌలింగ్ కోచ్

image

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విఫలమైతే జట్టుపై ప్రభావం పడేదని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. హార్దిక్ బౌలింగ్ సత్తాపై ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నామని చెప్పారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఈ ఆల్‌రౌండర్ రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఇవాళ అమెరికాతో తలపడనుంది.

Similar News

News January 31, 2025

సిరిసిల్ల: బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మృతి

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్‌నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News January 31, 2025

OTTలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

image

టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’ ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో ఈ మూవీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

News January 31, 2025

బాత్‌రూమ్‌లోనే టూత్‌బ్రష్ పెడుతున్నారా?

image

దంతాలను శుభ్రం చేసుకున్నాక <<15261921>>టూత్‌బ్రష్‌లను<<>> బాత్‌రూమ్‌లోనే పెట్టడం ప్రమాదమని సిద్దిపేట GOVT డిగ్రీ కాలేజీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. కమోడ్‌ ఫ్లష్ చేసినప్పుడు నీతి తుంపర్ల ద్వారా 3రకాల బ్యాక్టీరియా బ్రష్‌లపైకి చేరుతోందని గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ వల్ల దంతాల అరుగుదల, స్టెఫైలోకోకస్ ఆర్యస్‌తో మౌత్ అల్సర్, ఈ-కొలి వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బ్రష్‌లను ఎండ తగిలే చోట పెట్టాలంటున్నారు.