News September 26, 2025

పేరెంట్స్‌ను పట్టించుకోకపోతే ఆస్తిపై హక్కుండదు: SC

image

తల్లిదండ్రుల పోషణను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2007లో కేంద్రం తెచ్చిన ‘పేరెంట్స్, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ ప్రకారం పేరెంట్స్‌కు ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉందని పేర్కొంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్ధదంపతులు కోర్టుకెళ్లగా ఆస్తి తిరిగివ్వాలని కుమారుడిని ఆదేశిస్తూ తీర్పిచ్చింది.

Similar News

News February 8, 2026

IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ఇండియన్ <<>>ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్లొమా, ఇంటర్, వొకేషనల్ కోర్సు, టెన్త్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 1, 2006-జులై1, 2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎత్తు 152సెం.మీ. ఉండాలి. వెబ్‌సైట్: https://iafrecruitment.edcil.co.in

News February 8, 2026

కనకాంబరం సాగుకు అనువైన రకాలు

image

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.

News February 8, 2026

భాను సప్తమి వ్రతం నేడు ఎందుకు ఆచరిస్తారంటే?

image

నేడు భాను సప్తమి వ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వ్రతం చేయాలని సూచిస్తున్నారు. జాతకంలో సూర్య దోషం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, తేజస్సు పొందుతారట. సూర్యుడు ‘ఆరోగ్య ప్రదాత’ కావడంతో, భాను సప్తమి నాడు చేసే పూజ, అర్ఘ్యంతో మానసిక ప్రశాంతత, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.