News March 26, 2025

ప్రభాస్ అలా చేస్తే ‘కన్నప్ప’ చేసేవాడిని కాదు: మంచు విష్ణు

image

కన్నప్ప సినిమా తీసే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదని హీరో మంచు విష్ణు చెప్పారు. అయితే శివలింగాన్ని తాకే సీన్లు చిత్రీకరించే సమయంలో నేలపై పడుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ సినిమాను ప్రభాస్ చేస్తానని చెబితే తాను కన్నప్పను చేసేవాడిని కాదని పేర్కొన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కన్నప్ప నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 15, 2025

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

image

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్‌ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.

News December 15, 2025

మూడు దేశాల పర్యటనకు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్‌’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.

News December 15, 2025

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌-5 వీళ్లే

image

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా టాప్‌-5 ఫైనలిస్టులు ఖరారయ్యారు. తనూజ, డిమోన్‌ పవన్‌, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజన ఫైనల్‌ రేసులోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన డబుల్‌ ఎలిమినేషన్‌లో శనివారం <<18553037>>సుమన్‌శెట్టి<<>> ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆదివారం <<18559680>>భరణి<<>> ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.