News November 9, 2024

ప్రాఫిటబుల్ కంపెనీలూ లేఆఫ్స్ వేస్తే ఉద్యోగులు నమ్మేదెలా: ZOHO ఓనర్

image

లేఆఫ్స్ వేసే ప్రాఫిటబుల్ కంపెనీలను ఉద్యోగులెలా నమ్ముతారని ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రశ్నించారు. ‘ఆ కంపెనీ వద్ద $1BNS క్యాష్ ఉంది. వార్షిక ఆదాయం కన్నా ఇది 1.5 రెట్లు ఎక్కువ. 20% గ్రోత్‌రేటుతో లాభాల్ని ఆర్జిస్తోంది. అయినా $400 మిలియన్లతో షేర్లు బయ్‌బ్యాక్ చేసి, 12-13% ఉద్యోగుల్ని తొలగించి వారి విశ్వాసాన్ని ఆశించడం దురాశే’ అని అన్నారు. రీసెంటుగా 660 మందిపై వేటువేసిన ప్రెష్‌వర్క్స్‌ను విమర్శించారు.

Similar News

News November 25, 2025

హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

image

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌ వాట్సప్‌ నెంబర్‌: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణం పోలీస్‌ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

News November 25, 2025

సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

image

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్‌తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.