News November 25, 2024

లగచర్లకు రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారు: KTR

image

TG: ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని KTR అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారని మహబూబాబా‌ద్‌లో ఫైరయ్యారు.

Similar News

News November 25, 2024

లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న PILs తిరస్కరించిన సుప్రీంకోర్టు

image

రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న 3 పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంతో పాటు పీఠికనూ సవరించే అధికారం పార్లమెంటుకే ఉందని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ PV సంజయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు 42వ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ 2 పదాలను పీఠికలో చేర్చారు. వీటిని తొలగించాలని మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సహా కొందరు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు.

News November 25, 2024

కేర్‌టేకర్ చనిపోయిన రోజే జిరాఫీ మృతి

image

కొందరికి జంతువులతో ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. జంతువులూ అలాంటివారిని ఎంతో ప్రేమిస్తుంటాయి. స్కోప్జే జూలో పనిచేసే కేర్‌టేకర్ ట్రాజ్‌కోవస్కీ కూడా అలాంటి కోవకు చెందినవారే. పదేళ్లపాటు ఫ్లాపీ అనే జిరాఫీని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి ఆహారంతో పాటు అన్ని బాగోగులు చూసుకునేవారు. అయితే, గత ఏడాది నవంబర్ 26న అనుకోకుండా ట్రాజ్‌కోవస్కీ చనిపోగా గంటల వ్యవధిలోనే జిరాఫీ కూడా చనిపోయింది.

News November 25, 2024

MHలో బిహార్ ఫార్ములా అమలు చేయండి: శివసేన

image

మ‌హారాష్ట్ర‌లో బిహార్ ఫార్ములా అమ‌లు చేసి ఏక్‌నాథ్ శిండేను CMగా కొన‌సాగించాల‌ని శివ‌సేన కోరుతోంది. బిహార్‌లో RJDతో JDU విడిపోయిన‌ప్పుడు నితీశ్ కుమార్‌ను CMగా BJP కొన‌సాగించింది. 2020 బిహార్‌ ఎన్నికల్లో BJP 74 సీట్లు సాధించింది. JDUకి 43 సీట్లే దక్కినా అనంతర పరిణామాల్లో నితీశ్‌ను CMగా కొన‌సాగించింది. అదే మాదిరి MHలో BJP 132 స్థానాల్లో గెలిచినా శిండేకే CMగా అవకాశమివ్వాలని శివ‌సేన కోరుతోంది.