News November 2, 2024
రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి: సీఎం

AP: గుంతలు లేని రోడ్లే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని, ఈ దుస్థితికి గత పాలకుడే కారణమని విమర్శించారు. రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండొద్దని ఆదేశించారు.
Similar News
News November 2, 2025
రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.
News November 2, 2025
పంకజ్ త్రిపాఠి తల్లి కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి(89) అనారోగ్యంతో రెండు రోజుల కిందట మరణించారు. బిహార్లోని స్వస్థలం గోపాల్గంజ్లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీమ్ ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ(99) రెండేళ్ల క్రితం చనిపోయారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగు వారికీ దగ్గరైన విషయం తెలిసిందే.
News November 2, 2025
తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.


