News February 11, 2025
రోహిత్ మరో 13 పరుగులు చేస్తే..

ENGపై రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన IND కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుపై కన్నేశారు. రేపు జరిగే మ్యాచ్లో 13 పరుగులు చేస్తే ODIలలో వేగంగా 11,000 రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తారు. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 259 Innsలో 10,987 రన్స్ చేశారు. 222 ఇన్నింగ్సుల్లోనే 11వేల పరుగులు చేసిన కోహ్లీ టాప్లో ఉన్నారు. ఆ తర్వాత సచిన్(276Inns), పాంటింగ్(286Inns), గంగూలీ(288Inns), కల్లిస్(293Inns) ఉన్నారు.
Similar News
News December 17, 2025
కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: హరీశ్ రావు

TG: రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన <<18592868>>తీర్పుతో<<>> బహిర్గతమైందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైరయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.
News December 17, 2025
సర్పంచ్ ఎన్నికలు: జగన్పై చంద్రబాబు విజయం

TG: భద్రాద్రి జిల్లా గుండ్లరేవులో జగన్, చంద్రబాబు అనే వ్యక్తులు సర్పంచ్ బరిలో నిలవడంతో చాలా మందికి ఫలితంపై ఆసక్తి ఏర్పడింది. ఇవాళ్టి మూడో విడతలో బానోతు జగన్(Right)పై భూక్యా చంద్రబాబు (Left) విజయం సాధించారు. రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు ఇక్కడ తలపడటంతో ఈ పోరు మొదటి నుంచీ అత్యంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని 2 వేర్వేరు వర్గాల మద్దతుతో వీరు బరిలో నిలిచారు.
News December 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 99 సమాధానం

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
సమాధానం: పుష్య మాసం.
<<-se>>#Ithihasaluquiz<<>>


