News April 28, 2024
సంజయ్ నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం: పొన్నం

TG: 4 నెలల తమ పరిపాలనలో 6 గ్యారంటీల్లో కొన్ని అమలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడలో పలువురు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే బండి సంజయ్ పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారు? సంజయ్ నిరూపించాలి. ఆయన నిరూపిస్తే కరీంనగర్లో మేం పోటీ నుంచి తప్పుకుంటాం’ అని సవాల్ విసిరారు.
Similar News
News November 18, 2025
హిడ్మాకు బహుభాషల్లో పట్టు

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో హతమయ్యాడు.

YCP అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి అరెస్టు

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.