News July 26, 2024

షమీ కేజీ మటన్ తినకపోతే బౌలింగ్ వేగం తగ్గుతుంది: ఉమేశ్

image

భారత పేసర్ షమీ దేన్నయినా భరించగలడు కానీ మటన్ లేకపోతే తట్టుకోలేడని అతని ఫ్రెండ్ ఉమేశ్ తెలిపారు. ‘మటన్ లేకుండా ఓ రోజు తట్టుకుంటాడు. రెండో రోజు ఆందోళన, మూడో రోజు సహనం కోల్పోతాడు. అతను రోజూ KG మటన్ తినకపోతే బౌలింగ్ వేగం గంటకు 15km తగ్గుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కెరీర్, వ్యక్తిగత సమస్యలతో షమీ <<13693879>>సూసైడ్<<>> ఆలోచనలు చేశాడని ఉమేశ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News December 30, 2025

నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

image

మకరవిళక్కు పండుగ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మండల పూజ తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని <<18690795>>మూసివేసిన<<>> విషయం తెలిసిందే.

News December 30, 2025

కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

image

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

News December 30, 2025

119 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) ఘజియాబాద్‌ 119 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, BTech, BSc(engg.), MBA ఉత్తీర్ణులైనవారు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. JAN 11న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆఫీసర్ -గ్రేడ్1కు నెలకు రూ.30వేలు, ఆఫీసర్-గ్రేడ్2కు రూ.35,000, ఆఫీసర్-గ్రేడ్3కు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: bel-india.in/