News December 1, 2024
అలా అయితే దేశం వృద్ధి చెందదు: రాహుల్

ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కొద్ది మంది బిలియనీర్లకే దక్కినంత కాలం దేశం వృద్ధి చెందదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పేదల ఆర్థిక సమస్యలు పరిష్కారమైతేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల కనిష్ఠానికి, GDP వృద్ధి రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోవడం ఆందోళనకరమన్నారు. అందరికీ సమాన అవకాశాలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచనలు అవసరమన్నారు.
Similar News
News March 23, 2026
డర్టీ బాంబ్.. ఇరాన్ ఆఖరి అస్త్రం ఇదేనా?

సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను కలిపి చేసేదే ‘డర్టీ బాంబ్’. ఇది అణుబాంబులా భారీ విస్ఫోటం సృష్టించకపోయినా రేడియేషన్ను గాలిలో వ్యాపింపజేసి ప్రాంతాన్ని విషపూరితం చేస్తుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం తగినంత ఉండటంతో దీని తయారీ సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్ ఈ డర్టీ బాంబును ఆఖరి అస్త్రంగా వాడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 23, 2026
ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ సెషన్-2 ఎగ్జామ్స్

JEE మెయిన్-2026 చివరి విడత (సెషన్-2) పరీక్షల షెడ్యూల్ను NTA ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునేలా ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్స్’ను NTA విడుదల చేసింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచి ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పరీక్షకు కొన్ని రోజుల ముందు వస్తాయి.
News March 23, 2026
నేడు అకౌంట్లలోకి రూ.6,000

TG: సిద్దిపేట పర్యటనలో నిన్న సీఎం రేవంత్ <<19449281>>విడుదల<<>> చేసిన తొలి విడత రైతు భరోసా నిధులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. రూ.6వేల చొప్పున రూ.3,600 కోట్లు అన్నదాతల ఖాతాల్లో చేరనున్నాయి. మరో 20 రోజుల్లో రూ.2,700 కోట్లు, ఆ తర్వాత 20 రోజులకు రూ.2,700 కోట్లు రిలీజ్ చేస్తామని రేవంత్ వెల్లడించారు. మొత్తంగా దాదాపు 70 లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తామన్నారు.


