News July 8, 2024
అలా అయితే రీ-నీట్‌కు ఆదేశిస్తాం: సుప్రీం

నీట్ పవిత్రతను NTA దెబ్బతీసిందని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ-టెస్ట్‌కు ఆదేశిస్తామని పేపర్ లీకేజీపై విచారణ సందర్భంగా SC స్పష్టం చేసింది. ‘లీకైన పేపర్ వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. ముందు పేపర్ ఎలా లీకైంది? ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి’ అని వ్యాఖ్యానించింది.
Similar News
News November 20, 2025
26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్‌కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.
News November 20, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*శ్రీకాకుళం(D) ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ICMR ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పరిశోధన పూర్తి చేసేందుకు రూ.6.2 కోట్లు ఇవ్వనుంది: మంత్రి సత్యకుమార్
*వైసీపీ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారు. జగన్ చేసిన మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాలని ఆలోచిస్తున్నాడు: కన్నబాబు
*ఇవాళ బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న CM చంద్రబాబు, మంత్రి లోకేశ్.
News November 20, 2025
‘కొదమసింహం’ నాకు, చరణ్‌కు ఫేవరేట్ మూవీ: చిరంజీవి

తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘కొదమసింహం సినిమాలో నా స్టిల్ చాలా పాపులర్. తొలిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. నాకు, రామ్ చరణ్‌కు ఫేవరేట్ మూవీ’ అని తెలిపారు. కొదమసింహం సినిమాను ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.


