News August 13, 2025

అలా అయితే భారత్‌పై ట్రంప్ సుంకాలు ఎత్తేస్తారా!

image

రష్యా చమురు కొంటున్నందుకే భారత్‌పై 25% అదనపు సుంకాలు వేశామన్న ట్రంప్‌ మున్ముందు సంకట స్థితిని ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మనం ఫండింగ్ చేస్తున్నామన్నదే ఆయన ఆరోపణ. మరికొన్ని రోజుల్లో అలస్కాలో పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. అక్కడ సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు భారత్ చమురు కొంటే USకు అభ్యంతరం ఉండదా? సుంకాలు నిలిపేస్తుందా? మరో సాకు చెబుతుందా? అనేది వేచిచూడాలి.

Similar News

News January 29, 2026

ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ కీలక సమావేశం 

image

TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న హైదరాబాద్ రానున్నారు. 2న మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది.

News January 29, 2026

ఈ సంకేతాలు ఉంటే కిడ్నీ సమస్యలు!

image

* ఎక్కువ/తక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం.
* ముఖం, పాదాల్లో వాపులు.
* నురుగు/గోధుమ రంగు/రక్తంతో మూత్రం రావడం.
* త్వరగా అలసిపోయినట్టు/అలసటగా అనిపించడం.
* కండరాల తిమ్మిర్లు.
* చర్మం పొడిబారడం, దురద పెట్టడం.
* ఊపిరి సరిగ్గా అందకపోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 29, 2026

50 పరుగుల తేడాతో భారత్ ఓటమి

image

విశాఖలో జరిగిన 4వ T20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దూబె(65) చెలరేగి ఆడటంతో గెలుపు దిశగా పయనించింది. అతను ఔటవ్వగానే కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి 50 పరుగుల తేడాతో ఓడింది. శాంట్నర్ 3, సోధీ, డఫీ చెరో 2 వికెట్లు తీశారు.