News July 10, 2024
తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం: KTR

తెలంగాణలో TDPని బలోపేతం చేస్తే తమకే లాభం అని కేటీఆర్ అన్నారు. ‘మేం APలో BRS పెట్టినప్పుడు తెలంగాణలో TDPని బలోపేతం చేస్తామని చంద్రబాబు చెప్పడంలో తప్పేముంది? TGలో టీడీపీ బలపడితే మాకే లాభం. చంద్రబాబు NDAలో కీలకంగా ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నాం’ అని ఢిల్లీలో చిట్‌చాట్‌లో అన్నట్లు మీడియా వర్గాల సమాచారం. కాగా తెలంగాణలో TDPని స్ట్రాంగ్ చేస్తానని CBN అనడం తెలిసిందే.
Similar News
News April 9, 2026
‘ఆంటీ’ అన్నారని కోర్టుకు.. రూ.1.8 లక్షల ఫైన్

ఆంటీ అని పిలిచారని లండన్‌లో భారత సంతతి మహిళ ఇల్డా ఎస్టెవ్స్(61) కోర్టుకెక్కి విజయం సాధించారు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)లో నర్సుగా పనిచేస్తున్నారు. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తోటి ఉద్యోగి ఆంటీ అంటూ వేధించారని, ఇది వయో, లింగ వివక్ష కిందకి వస్తుందని కేసు పెట్టారు. విచారించిన కోర్టు ఆమెకు నష్టపరిహారంగా ₹1.8 లక్షలు చెల్లించాలని NHSను ఆదేశించింది.
News April 9, 2026
పాక్ నమ్మదగిన మీడియేటర్ కాదు: ఇజ్రాయెల్

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశామని పాకిస్థాన్ చెప్పుకుంటోంది. అయితే మీడియేటర్‌గా ఆ దేశ విశ్వసనీయతపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సందేహాలు వ్యక్తం చేశారు. పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని చెప్పారు. వాషింగ్టన్ సొంత కారణాలతో వ్యూహాత్మకంగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో హమాస్‌తో డీల్ కోసం ఖతర్, తుర్కియేను US ఎలా వాడుకుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.
News April 9, 2026
10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It


