News November 8, 2024
తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్
TG: కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? రేవంత్ సీఎం అయ్యేవాడా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. KCR ఆనవాళ్లు లేకుండా మూసీ శుద్ధి చేయడం సాధ్యం కాదని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క ఇళ్లు కట్టలేదని దుయ్యబట్టారు. కూలగొట్టడం తప్ప నిర్మించడం రేవంత్‌కు తెలియదని మండిపడ్డారు. సీఎం బెదిరింపులకు భయపడమని, ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.
Similar News
News November 8, 2024
SAvsIND: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు ఎంతంటే..
డర్బన్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ 8 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. శాంసన్ 107 రన్స్, తిలక్ 33 పరుగులతో రాణించారు. 15 ఓవర్ల సమయానికి భారత్ కనీసం 220 పరుగులు చేసేలా కనిపించినా.. శాంసన్ ఔటయ్యాక మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 202 రన్స్‌తోనే సరిపెట్టుకుంది. సఫారీ బౌలర్లలో కొయెట్జీ 3 వికెట్లు, జాన్సెన్, మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ తీశారు.
News November 8, 2024
డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనేనా?
సినీ డైరెక్టర్ క్రిష్ ఈనెల 10న రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. HYDకు చెందిన గైనకాలజిస్ట్ డా.ప్రీతి చల్లాతో ఆయన వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈనెల 16న జరిగే రిసెప్షన్‌కు సినీ ప్రముఖులు హాజరవుతారని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ 2018లో విడాకులు తీసుకున్నారు. వేదం, గమ్యం, మణికర్ణిక, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
News November 8, 2024
Unusual: అదృష్టం తెచ్చిన కారుకు ఘనంగా అంత్యక్రియలు
18 ఏళ్ల క్రితం కొన్న మారుతి వ్యాగనార్ కారు గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాకు చెందిన సంజయ్ పోల్రా జీవితాన్ని మార్చేసింది. 2006లో ప్రాప్టరీ బ్రోకర్‌గా ఉండగా కొన్న ఈ కారు తనను బిల్డర్ స్థాయికి తెచ్చిందని సంజయ్ గర్వంగా చెప్పారు. ఇప్పుడు ఆడి కారులో తిరిగేలా తన అదృష్టాన్ని మార్చేసిందన్నారు. తాజాగా కారు షెడ్డుకు చేరడంతో మంత్రోచ్ఛారణల మధ్య 1,500 మంది సమక్షంలో దాన్ని 15 అడుగుల గొయ్యిలో పాతిపెట్టారు.