News February 9, 2025

అలా జరిగితే కేజ్రీవాల్ గెలిచేవారు!

image

న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ఓటమికి DL మాజీ CM షీలా దీక్షిత్ కొడుకు సందీప్ పరోక్షంగా కారణమయ్యారు. INC తరఫున పోటీ చేసిన ఆయనకు 4,568 ఓట్లు వచ్చాయి. గెలిచిన BJP అభ్యర్థి పర్వేశ్ వర్మ, కేజ్రీకి మధ్య ఓట్ల తేడా 4,089 కావడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కేజ్రీవాల్ గట్టెక్కేవారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా 2013లో న్యూఢిల్లీలోనే షీలాను కేజ్రీవాల్ ఓడించారు.

Similar News

News September 16, 2025

డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

image

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

News September 15, 2025

DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

image

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.