News September 23, 2024
అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు

UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.
Similar News
News November 29, 2025
MHBD: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి ఎంపీడీవోలు, తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు.

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.