News September 2, 2025

అలా అయితే హరీశ్ వేరే పార్టీ పెట్టుకుంటారు: కోమటిరెడ్డి

image

TG: కవిత విషయంపై రేపు ఆలోచిద్దామని KCR అన్నట్లు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హరీశ్ రావు ఊరుకోరన్నారు. ఆయన వేరే పార్టీ పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. అయితే తాము కేసీఆర్, కవిత కుటుంబ గొడవలో తలదూర్చమని అన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని కామెంట్ చేశారు. ఇక కవిత తమ సీఎం గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Similar News

News September 4, 2025

జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎన్ని రూ.వేలు సేవ్ అంటే?

image

పండగల వేళ GST శ్లాబులను తగ్గిస్తూ సామాన్యులకు కేంద్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆహార పదార్థాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతరత్రా <<17605715>>వస్తువులపై<<>> GSTని తగ్గించడం బిగ్ రిలీఫ్ కలిగించింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.45వేలు ఆదా అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదన్న గత ప్రకటనతో పాటు జీఎస్టీ ఆదా కలిపి ఏటా రూ.1.25లక్షలు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

News September 4, 2025

నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైంది: మోదీ

image

దేశం స్వావలంబన సాధించాలని, నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయంతో సైంటిస్టులు కావాలనే కాంక్ష విద్యార్థుల్లో పెరిగిందని చెప్పారు. ‘టీచర్లు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. యువతరానికి దారి చూపాలి. చిన్నారుల్లో డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గేమింగ్, గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది’ అని PM వివరించారు.

News September 4, 2025

మంత్రి లోకేశ్‌‌కు ఏపీ క్యాబినెట్ అభినందనలు

image

AP: సవాళ్లను ఎదుర్కొంటూ డీఎస్సీని నిర్వహించిన మంత్రి నారా లోకేశ్‌ను క్యాబినెట్ మంత్రులు అభినందించారు. DSCని అడ్డుకునేందుకు 72 కేసులు వేసినా ప్రతి సవాల్‌ను దీటుగా ఎదుర్కొని నిర్వహించారని కొనియాడారు. కొందరు పోలీసులు డీఎస్సీకి ఎంపికవ్వగా వీరు టీచర్ వృత్తిని ఎంచుకుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటి భర్తీకి లీగల్ సమస్యలను వేగంగా పరిష్కరిద్దామని లోకేశ్ చెప్పారు.