News August 8, 2024

అలా జరిగితే ఫొగట్‌కు సిల్వర్ మెడల్!

image

ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌‌ను డిస్‌క్వాలిఫై చేయడంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ విచారణ చేపట్టింది. ఈక్రమంలో తన బరువును మరోసారి కొలవాలని COAను ఆమె అభ్యర్థించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను స్వతహాగా మూడు మ్యాచులు గెలిచి ఫైనల్‌కు వచ్చానని, తనకు సిల్వర్ మెడల్ ఇప్పించాలని ఆమె కోరారు. దీనిపై 48 గంటల్లో COA సమాధానమివ్వనుంది. అనుకూలంగా తీర్పు వస్తే ఫొగట్‌కు సిల్వర్ దక్కనుంది. HOPE FOR THE BEST

Similar News

News April 2, 2026

కిడ్నీ ముఠా గుట్టురట్టు.. మూవీ తీయొచ్చేమో!

image

UP కాన్పూర్‌లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.

News April 2, 2026

గుడ్ న్యూస్: రూ.7,358 కోట్లు దశలవారీ చెల్లింపు

image

AP: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7,358 CR బకాయిల విడుదలకు GOVT చర్యలు చేపట్టింది. CM ఆదేశాలతో చెల్లింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గ్రాట్యుటీ ₹3,411CR, లీవ్ ఎన్‌క్యాష్మెంటు ₹1800CR ఇవ్వాల్సి ఉండగా నిధుల అందుబాటును అనుసరించి విడుదల చేస్తున్నామంది. ఇప్పటికే PF కింద ₹1,848CR, GLI కింద ₹76CR, పోలీసుల సరెండర్ లీవులకు ₹223CR జమ చేశామని ఫైనాన్స్ విభాగం తెలిపింది.

News April 2, 2026

‘అతలాకుతలం’ వెనుక ఇంత ఉందా?

image

విపత్తుల కారణంగా భారీ నష్టం సంభవించినప్పుడు, వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ‘అతలాకుతలం’ అనే జాతీయం వాడతాం. పురాణాల ప్రకారం భూమి కింద ఏడు లోకాలు(అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం) ఉన్నాయి. ఇందులో సుతలానికి బదులు కుతలమనే శబ్దాన్ని వాడుతున్నారు. ఆ లోకాలు తారుమారయితే పరిస్థితులు దెబ్బతిన్నట్లే. నిజ జీవితంలోనూ పరిస్థితులు తలకిందులయ్యాయని చెప్పేందుకూ దీన్ని వాడుతున్నాం.
<<-se>>#EPICSAYINGS<<>>