News June 30, 2024

అలా జరిగితే ఉచిత విద్యుత్ ఉండదు: జగదీశ్ రెడ్డి

image

TG: విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీకి CM రేవంత్ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే పేదవారికి, రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ ఉండవన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదన్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 9, 2025

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)వరంగల్‌లో 3పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News December 9, 2025

సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

image

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్‌లో ఇండియన్ సిటిజన్‌షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్‌లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

News December 9, 2025

మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

image

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్‌లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.