News November 25, 2024

అదే జరిగితే నేడు రూ.10లక్షల కోట్ల లాభం!

image

మహారాష్ట్రలో మహాయుతి విజయంతో నిఫ్టీ 400, సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే నేడు ఇన్వెస్టర్లు రూ.10L కోట్లమేర లాభం పొందుతారు. కేంద్ర పాలసీలకు అనుగుణంగా ఉండే కంపెనీల షేర్లలో వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో BJP అనుకూల ప్రమోటర్లున్న కంపెనీలపై ఆసక్తి పెరిగింది. APలో NDA గెలిచినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా అప్పర్ సర్క్యూట్‌ తాకడం తెలిసిందే.

Similar News

News November 25, 2024

ఈ ముగ్గురి చావుకు కారణం ఎవరు?

image

గూగుల్ మ్యాప్స్ చూస్తూ కారు నడపడంతో అది వంతెనపై నుంచి పడి <<14696822>>ముగ్గురు<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గూగుల్ మ్యాప్స్ తప్పిదంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పొరపాటూ ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 2022లో బ్రిడ్జిలో సగభాగం కొట్టుకుపోతే మిగతాది అలాగే వదిలేశారని, కనీసం బారికేడ్లు పెట్టలేదని ఫైరవుతున్నారు. ఆ రోడ్డు ఎందుకు క్లోజ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 25, 2024

‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్

image

మంచు విష్ణు ప్రధానపాత్రలో నటించిన భారీ బడ్జెట్‌ మూవీ ‘కన్నప్ప’ రిలీజ్ డేట్‌ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు విష్ణు ‘X’లో వెల్లడించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర అగ్రనటులు నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

News November 25, 2024

గాలి నాణ్యతను బట్టి భూమి ధరను నిర్ధారించాలి: జెరోధా సీఈవో

image

కాలుష్యాన్ని తగ్గించాలంటే గాలి&నీటి నాణ్యతను బట్టి ఆ ప్రాంత భూమి ధరను నిర్ణయించేలా రూల్ తేవాలని జెరోధా CEO నితిన్ అభిప్రాయపడ్డారు. ‘ఇలా చేస్తే అక్కడున్న యజమానులంతా గ్రూప్‌గా మారి పర్యావరణంపై దృష్టి పెడతారు. నా అనే ఇల్లు గురించి ఆలోచిస్తేనే మన లేఅవుట్‌ పరిస్థితులు మారతాయి. AQIలో ఢిల్లీపైనే అందరూ దృష్టిసారించినా ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత పడిపోయింది’ అని ట్వీట్ చేశారు.