News January 6, 2025
అలాగైతే.. మళ్లీ టెలికం ఛార్జీలు పెంచక తప్పదు!
డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ రూల్స్పై టెలికం కంపెనీలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటాను భారత్ బయటకు బదిలీ చేయడంపై రూపొందించిన రూల్స్ ఇంటర్నేషనల్ కాల్స్, మెసేజెస్, విదేశీ నంబర్లకు వాట్సాప్ మెసేజులు పంపడంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. వీటిని అమలు చేయడం కష్టమని, చాలా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. టెలికం ఛార్జీల రూపంలో ఈ భారమంతా కస్టమర్లపై వేయాల్సి వస్తుందని చెప్తున్నారు.
Similar News
News January 8, 2025
నేటి ముఖ్యాంశాలు
* TG: మార్చి నెలాఖరు కల్లా మెట్రో DPRలు రెడీ చేయాలి: CM రేవంత్
* BJP కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
* నేను పైసా అవినీతి చేయలేదు: KTR
* రేవంత్ నోట్ల కట్టలతో దొరికారు.. KTR HYD బ్రాండ్ పెంచారు: హరీశ్
* AP: 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు: CM CBN
* 91 లక్షల మందికి ఫ్రీ సిలిండర్లు అందజేత: TDP
* విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి: మంత్రి అచ్చెన్న
* నేపాల్లో భూకంపం: 126 మంది మృతి
News January 8, 2025
‘దాదా’ స్మారకం: బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం
దేశ రాజకీయాల్లో ‘దాదా’గా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ స్మారకం నిర్మాణం నిర్ణయం వెనుక BJP సొంత వ్యూహాలు ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం. ఒకవైపు మన్మోహన్ స్మారకం కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే తన తండ్రి స్మారకం గురించి ఎందుకు అడగలేదని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ గతంలో INCని ప్రశ్నించారు. INC కూడా ప్రణబ్ స్మారకంపై మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
News January 8, 2025
ప్రధాని రాకకోసం ఎదురుచూస్తున్నాం: సీఎం
AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.