News November 11, 2024
ఎన్నికల ఫలితాలు సరిగ్గా అంచనా వేస్తే రూ.కోటి రివార్డు

MPకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డా.PN.మిశ్రా అదిరిపోయే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా అంచనా వేస్తే రూ.కోటి బహుమతి ఇస్తానని ప్రకటించారు. సరిగ్గా అంచనా వేయలేకపోయినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని షరతు పెట్టారు. కొందరు శాస్త్రీయ ఆధారాలు లేకుండా అంచనాలు వేస్తూ, మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారని అంటున్నారు.
Similar News
News December 29, 2025
మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.
News December 29, 2025
జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.
News December 29, 2025
గజగజ.. రేపు కూడా కొనసాగనున్న చలి తీవ్రత!

TGలో రేపు కూడా చలి తీవ్రత కొనసాగనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, MDK, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 5-10 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతుందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని చెప్పింది. ఉదయం, రాత్రివేళల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటికి వెళ్తే తప్పనిసరిగా స్వెటర్లు ధరించాలని వైద్యులు సూచించారు.


