News July 9, 2024
పరీక్షలు వాయిదా వేస్తే యువతకే నష్టం: సీఎం రేవంత్

TG: DSC, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్లపై CM రేవంత్ మహబూబ్నగర్ సభలో ధ్వజమెత్తారు. ‘పరీక్షలు తరచూ వాయిదా వేస్తే యువత నష్టపోతుంది. త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రానివారు మరో ఉద్యోగం చూసుకుంటారు. గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే.. కోర్టు నోటిఫికేషన్ను రద్దు చేస్తుంది. పదేపదే పరీక్షలను రద్దు చేయించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది’ అని CM ఆరోపించారు.
Similar News
News December 8, 2025
రెచ్చగొట్టేలా జైశంకర్ వ్యాఖ్యలు: పాకిస్థాన్

విదేశాంగ మంత్రి జైశంకర్పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.
News December 8, 2025
ఊల వేసిన మడిలో నీరుంటుందా?

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 8, 2025
నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.


