News June 14, 2024

కాలు విరిగితే అట్టముక్క కట్టారు!

image

కాలు విరిగిందని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ముకేశ్ కుమార్ అనే వ్యక్తి అక్కడి వైద్యులు చేసిన చికిత్సకు నిర్ఘాంతపోయాడు. ఫ్రాక్చర్ అయిన కాలుకు అట్టముక్క కట్టి పంపించారు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ పరిధిలోని మినాపూర్‌లో ఈనెల 7న జరిగింది. ఇక్కడి వైద్యం నచ్చక శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అనే మరో చోట చూపించుకున్నాడు. అయితే వారు కూడా ఈ కార్డ్‌బోర్డ్ తీయకుండానే ఈనెల 7-11 మధ్య చికిత్స అందించడం కొసమెరుపు.

Similar News

News October 25, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

News October 25, 2025

C-DACలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

image

<>C-DAC<<>> 7 ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంసీఏ/MSC/ME/MTECH ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు నవంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్ : https://www.cdac.in

News October 25, 2025

ముడతలను ఇలా తగ్గించుకోండి

image

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్‌స్ర్కీన్‌ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్‌-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.