News May 24, 2024
ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రధానిపై కాల్పులు జరిపా: నిందితుడు
ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడం వల్లే స్లోకేవియా ప్రధాని రాబర్ట్ ఫికో(59)పై కాల్పులు జరిపినట్లు నిందితుడు(71) పోలీసుల విచారణలో తెలిపారు. తన చర్యపై పశ్చాత్తాప పడుతున్నానని.. ప్రధానిని క్షమాపణ కోరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు సాయం చేయాలన్నది అతని ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ నెల 15న ఫికోపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం PM చికిత్స పొందుతున్నారు.
Similar News
News December 27, 2024
రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: వేణుగోపాల్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
News December 27, 2024
PHOTO: పాకిస్థాన్‌లో మన్మోహన్ సింగ్ ఇల్లు
మన్మోహన్ తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్‌లోని గాహ్ అనే మారుమూల గ్రామంలో జన్మించి, స్కూల్ విద్యను అక్కడే అభ్యసించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఇండియాకు వలస వచ్చింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో నానమ్మ వద్ద పెరిగారు. 1991, 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని మన్మోహన్ తన పనితీరుతో గట్టెక్కించారు. పై ఫొటోలో PAKలోని మన్మోహన్ ఇల్లు, స్కూలు చూడొచ్చు.
News December 27, 2024
భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా
AP: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.