News October 16, 2024
బియ్యాన్ని నానబెట్టి వండితే..

బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.
Similar News
News January 22, 2026
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేయనుందా?

T20 WC మ్యాచులు భారత్లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డ్ చెప్పడాన్ని ICC సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడాల్సిందే అని చెప్పినా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు భావిస్తోంది. విచారణలో ఇదే నిజమని తేలితే BCBని సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న WC ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే డెసిషన్ తీసుకోనుందని అభిప్రాయపడుతున్నాయి.
News January 22, 2026
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్కేనా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. BRS కీలక నేతలకు సిట్ వరుసబెట్టి నోటీసులు ఇస్తోంది. ఈ నెల 20న హరీశ్ రావును విచారించిన అధికారులు తాజాగా KTRకూ నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా నెక్స్ట్ సిట్ నుంచి నోటీసులు వచ్చేది BRS అధినేత KCRకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 22, 2026
సౌతాఫ్రికా WC జట్టులో మార్పులు

T20 WC జట్టులో SA మార్పులు చేసింది. బ్యాటర్లు జోర్జి, ఫెరీరా గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారని, వారి స్థానాల్లో స్టబ్స్, రికెల్టన్ను తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు మిల్లర్ కండరాల గాయంతో బాధపడుతున్నారని, ఫిట్నెస్ టెస్టులో పాసైతేనే ఆయన WCలో ఆడతారని తెలిపింది.
టీమ్: మార్క్రమ్(C), బాష్, బ్రెవిస్, డికాక్, జాన్సెన్, లిండే, కేశవ్, మఫాకా, మిల్లర్, ఎంగిడి, నోర్ట్జే, రబాడ, రికెల్టన్, స్మిత్, స్టబ్స్


