News January 3, 2025

రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్

image

TG: రాష్ట్రప్రభుత్వం రింగ్ రోడ్డు(RRR) ఉత్తర అలైన్‌మెంట్‌ను మార్చాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరఫున భారీ ఉద్యమాన్ని మొదలుపెడతామని హెచ్చరించారు. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ కూడా అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్ చేసింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వచ్చి భువనగిరిలో బాధితులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారం రాగానే పట్టించుకోవడం మానేశారు’ అని విమర్శించారు.

Similar News

News January 5, 2025

BREAKING: భారత్ ఓటమి

image

సిడ్నీ టెస్టులో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో BGT సిరీస్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 141/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 16 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా బౌలింగ్‌కు రాలేదు.

News January 5, 2025

దివ్యాంగ విద్యార్థులకు నేరుగా అకౌంట్లలోనే పింఛన్: మంత్రి డోలా

image

AP: దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్‌ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్‌లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.

News January 5, 2025

ఇంటర్, డిగ్రీ అర్హత.. భారీ జీతంతో ఉద్యోగాలు

image

CBSEలో 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. https://www.cbse.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 142 సూపరింటెండెంట్(డిగ్రీ అర్హత), 70 జూనియర్ అసిస్టెంట్(ఇంటర్ అర్హత) ఉద్యోగాలున్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ సూపరింటెండెంట్‌కు ₹35,400-₹1,12,400, JAకు ₹19,900-₹63,200 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.