News March 13, 2025

స్పీకర్‌ అలా వ్యవహరించకపోతే అవిశ్వాసం పెడతాం: హరీశ్ రావు

image

TG: స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ‘సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అని జగదీశ్ రెడ్డి అన్నారు. “నీ” అన్న మాట ఆయన అనలేదు. “మీ” అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసనలు చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2026

6-7 డేటింగ్: ‘పర్ఫెక్ట్’ వద్దు.. ‘ప్రశాంతత’ ముద్దు!

image

అందం, హోదాలో 10/10 ఉండే భాగస్వామి కోసం వెతికి అలసిపోకుండా నచ్చిన 6 లేదా 7 రేటింగ్ ఉన్నవారితో జెన్-జీ డేటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనినే ‘6-7 డేటింగ్’ అంటున్నారు. సినిమాటిక్ రొమాన్స్ కంటే మానసిక ప్రశాంతత, భరోసా ఇచ్చే తోడు దొరికితే చాలని భావిస్తున్నారు. పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అనే భ్రమల కంటే మనల్ని అర్థం చేసుకునే ‘గుడ్ ఎనఫ్’ పార్ట్‌నరే మేలని జెన్-జీ నమ్ముతోంది.

News February 8, 2026

SERలో 54 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సౌత్ ఈస్ట్రన్ రైల్వే(<>SER<<>>)లో స్పోర్ట్స్ కోటాలో 54 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBDలకు రూ.250. వెబ్‌సైట్: https://rrcser.co.in

News February 8, 2026

స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. గుంటూరు, తిరుపతిలో స్కిన్‌లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్‌లో మాత్రం కేజీ రూ.270-280 ఉంది. విజయవాడ, కామారెడ్డిలోనూ రూ.270 వరకు విక్రయిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1,000 వరకు ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.