News October 29, 2025

అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

image

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.

Similar News

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

image

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.

News October 29, 2025

‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

image

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

News October 29, 2025

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.