News July 13, 2024

ఐటీ రిటర్న్స్‌ ఉంటే రైతు భరోసా రాదనుకోవద్దు: తుమ్మల

image

TG: రైతులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రైతు భరోసా రాదేమోనని భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా అమలుపై వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రుణమాఫీని ఆగస్టులో చేస్తాం. దీని వల్ల పెట్టుబడి సాయం కొంచెం ఆలస్యం కావొచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం జరిగితే రూ.10వేల వరకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

గద్వాల్: పీఎండీడీకేవై కార్యాచరణ రూపొందించాలి: నీతి ఆయోగ్

image

దేశవ్యాప్తంగా పీఎండీడీకేవైకు ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ పథకం అమలుకు అధికారులు యాక్షన్ ప్లాన్‌ను పీఎండీడీకేవై వెబ్ సైట్‌లో ఈనెల 6 లోగా అప్లోడ్ చేయాలన్నారు.

News December 4, 2025

SBIలో 996 పోస్టులకు నోటిఫికేషన్

image

SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in

News December 4, 2025

కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి?: MP

image

TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సభలో BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ‘ఇది చిన్న విషయంగా నవ్వుతారు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద సమస్య. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారింది. సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని జనం అంటున్నారు. కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలి’ అని కోరారు.