News January 30, 2025

‘వాట్సాప్ గవర్నెన్స్’లో సమస్య వస్తే మేమే ఫోన్ చేస్తాం: లోకేశ్

image

AP: గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని మంత్రి లోకేశ్ చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టే <<15308535>>వాట్సాప్ గవర్నెన్స్‌ను<<>> ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ 161 సేవలను లాంచ్ చేశామని, త్వరలో 360 సేవలకు విస్తరిస్తామని వెల్లడించారు. 3-4 నెలల్లో వాయిస్ బేస్డ్ AI బోట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఏదైనా సమస్య వస్తే తామే కస్టమర్‌కు ఫోన్ చేసి పరిష్కరిస్తామన్నారు.

Similar News

News December 16, 2025

‘కొండగట్టు అంజన్న’కు అటవీ శాఖ నోటీసులు

image

TG: ‘కొండగట్టు ఆంజనేయ స్వామి’ గుడికి అటవీశాఖ నోటీసులివ్వడం వివాదంగా మారింది. ఇక్కడి 6 ఎకరాలు తమవని, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చే అధికారం తమకుందని అందులో పేర్కొంది. కాగా వేద పాఠశాల, వసతి, భోజనశాల అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. వాహన పూజలు, గిరి ప్రదక్షిణ దీనిలో సాగుతుంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని BJP చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.

News December 16, 2025

స్పిన్నర్‌కు భారీ ధర

image

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్‌(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్‌(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News December 16, 2025

పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదు: కేటీఆర్

image

TG: పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదని, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సొంత ఇళ్లు అమ్మి కాంగ్రెస్ నేతలు నిధులివ్వడం లేదని ఫైరయ్యారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ సన్మానించారు.