News December 3, 2024
ఆందోళన చేపడితే ఆదివారం సభ పెడతా: ఓం బిర్లా

వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్‌సభను ఆదివారాలూ నడిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తానని తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో క్రితంవారం సభ సాగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ‘డిసెంబర్ 14న 11AMకు సభ మొదలవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే సభ్యులు ఆదివారాలూ రావాల్సి వస్తుంది’ అని అన్నారు.
Similar News
News December 5, 2025
కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.
News December 5, 2025
₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి TTDకి ₹14 కోట్లు ఎలా కట్టాడు జగన్?: పల్లా

AP: TTD పరకామణి చోరీపై YCP చీఫ్ జగన్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘చిన్న చోరీయే. పోయింది ₹72 వేలే’ అని అనడంపై TDP మండిపడుతోంది. ₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి తిరిగి TTDకి ₹14CR ఎలా కట్టగలిగాడు? తీసుకోవడానికి సుబ్బారెడ్డి ఎవరు? దొంగిలించిన దానికి అదనంగా డబ్బిస్తే కేసు మాఫీ అవుతుందా? CBIకి ₹70 వేల కోట్లిస్తే మీ కేసులూ మాఫీ చేసేయొచ్చా జగన్!’ అని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
News December 5, 2025
నిరంతర ట్రాకింగ్‌కు కేంద్రం ప్రతిపాదనలు! వ్యతిరేకిస్తున్న సెల్ కంపెనీలు

శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) సిస్టమ్‌ను యాక్టివ్‌లో ఉంచడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. సెల్ టవర్ డేటా ఆధారంగా కేసులను దర్యాప్తు సంస్థలు విచారిస్తుంటాయి. దీనికి టెలికం సంస్థల డేటాపై ఆధారపడతాయి. కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాలంటే A-GPS తప్పనిసరి చేయాలని టెలికం సంస్థలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రైవసీకి భంగం కలుగుతుందని సెల్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.


