News March 13, 2025

ఆసీస్ కెప్టెన్ ఉంటే.. SRHకు కప్ పక్కా..!

image

IPL 2025 కోసం SRH సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆటగాళ్లు HYD చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా ఆస్ట్రేలియా క్రికెటర్ SRHకు కెప్టెన్‌గా ఉంటే టైటిల్ కచ్చితంగా వస్తుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో (దక్కన్ ఛార్జర్స్), 2016లో వార్నర్ నాయకత్వంలో టైటిల్ సాధించిందని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కమిన్స్ కెప్టెన్‌గా ఉండటంతో టైటిల్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 28, 2025

SNBNCBSలో ఫ్యాకల్టీ పోస్టులు

image

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (SNBNCBS) ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ(అప్లైడ్ సైన్స్/ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.78,800, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,23,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bose.res.in/

News November 28, 2025

టాక్సిక్ వర్క్ కల్చర్‌లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

image

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.

News November 28, 2025

అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.