News September 22, 2024

చర్చిలో అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా?: పవన్

image

తిరుమలలో జరిగినట్లు చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే చర్చి/మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ‘ అని ఫైరయ్యారు.

Similar News

News September 22, 2024

GET READY: 2.07కి ‘దేవర’ రిలీజ్ ట్రైలర్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఉదయం 11.05కు రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్‌ను మధ్యాహ్నం 2.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేవర మాస్‌ను చూసేందుకు అంతే ఆత్రుతగా మరికొద్దిసేపు వేచి ఉండాలని పేర్కొన్నారు. ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ గురించి మీరూ ఎదురుచూస్తున్నారా? కామెంట్ చేయండి.

News September 22, 2024

ఒవైసీలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి

image

TG: ఎంఐఎం పార్టీ నేతలు, ఒవైసీ సోదరులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. కరీంనగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం విచారణ చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

News September 22, 2024

పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

image

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్‌లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.