News October 8, 2025
భక్తి ఉంటే చాలు.. శివుడే అడ్డంకుల్ని తొలగిస్తాడు!

భక్తి యోగం అన్ని మార్గాలకంటే అత్యంత శ్రేష్ఠమైనది. దీనికి సంపద, జ్ఞానమనే కఠిన నియమాలు అవసరం లేదు. నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తులకు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడే స్వయంగా అన్ని అడ్డుగోడలను, విఘ్నాలను తొలగిస్తాడు. ఏ కష్టమూ లేకుండా తత్వజ్ఞానం లభించేలా అనుగ్రహిస్తాడు. శివుని దయతోనే ముక్తి, బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతాయి. మనల్ని రక్షించేది, భక్తి మార్గంలో నడిపించేది ఆ పరమ శివుడే! <<-se>>#Daivam<<>>
Similar News
News October 8, 2025
ట్రంప్ ఆంక్షలు.. USకు నో చెబుతున్న IND స్టూడెంట్స్!

ట్రంప్ తీసుకొస్తున్న కొత్త ఆంక్షలతో US వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు UK, కెనడా, AUS, జర్మనీ వంటి దేశాల వైపు చూస్తున్నారు. దీంతో USకు వెళ్లే IND స్టూడెంట్స్ సంఖ్య భారీగా తగ్గుతోంది. ట్రేడ్.జీవోవి డేటా ప్రకారం 2024 AUGతో పోలిస్తే ఈ ఏడాది US వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 44% తగ్గింది. వీసాల జారీలో స్ట్రిక్ట్ రూల్స్, లివింగ్ కాస్ట్ పెరుగుదల వంటి అంశాలే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News October 8, 2025
వాదనలు విన్పించాలని సింఘ్వీకి రేవంత్ విజ్ఞప్తి

TG: స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ్టి విచారణ పట్ల కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో విన్పించాల్సిన వాదనలపై CM <<17942355>>రేవంత్<<>> నిన్న లీగల్ ఎక్స్‌పర్ట్స్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాదనలు విన్పించాలని పార్టీ సీనియర్ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీని రేవంత్ కోరారు. అటు BC మంత్రులంతా HC దగ్గరే ఉండి పరిణామాలు పరిశీలించాలని CM ఆదేశించారు.
News October 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 29

1. వశిష్ట మహాముని భార్య ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?
3. తిరుమలలో స్వామివారికి నిర్వహించే తొలి సేవ పేరేంటి?
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ఏది?
5. జీవితంలోని పురుషార్థాలు ఎన్ని?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>