News January 7, 2025
పెళ్లిలో మందు, డీజే లేకపోతే రూ.21వేల బహుమతి

వివాహాల్లో మద్యం, డీజే సాధారణంగా మారిపోయాయి. వీటితో ఆనందంతో పాటు అవతలి వారికి అసౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా పంజాబ్లోని బఠిండా జిల్లా బల్లా గ్రామ పెద్దలు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకున్న వారికి రూ.21వేలు బహుమతిగా ఇస్తున్నారు. వృథా ఖర్చును తగ్గించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు సర్పంచ్ అమర్జిత్ కౌర్ తెలిపారు.
Similar News
News November 25, 2025
HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News November 25, 2025
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్: సుందర్

గువాహటి పిచ్ బ్యాటింగ్కు అనుకూలమేనని భారత ఆల్రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.


