News December 3, 2024

వైరల్ ఫీవర్ సీజన్లో ఈ ఫుడ్స్ తీసుకుంటే..

image

పొగమంచు, చలి, వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైరల్ ఫీవర్లు వ్యాప్తిచెందే ఈ కాలంలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, ఉసిరి, అల్లం, వెల్లుల్లి, పసుపు, తులసి, తేనె, సోంపును విరివిగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను తినాలి. ప్రోబయాటిక్స్ ఉండే పెరుగు, మజ్జిగ, సద్దన్నం మేలు చేస్తాయి.

Similar News

News November 9, 2025

ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం

image

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ(రమేశ్ బాబు కుమారుడు) ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. #AB4 వర్కింగ్ టైటిల్‌తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గొప్ప ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుందని డైరెక్టర్ తెలిపారు.

News November 9, 2025

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో 13 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా, టెన్త్, ఐటీఐ/NTC/NAC అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.nrsc.gov.in

News November 9, 2025

ఫ్లోరైడ్ ప్రభావంతో మందగిస్తున్న తెలివితేటలు

image

బాల్యంలో ఫ్లోరైడ్‌ ప్రభావానికి గురికావడం వల్ల పిల్లల తెలివితేటలు మందగిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. బావులు, బోరుబావుల నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే పళ్లు పుచ్చిపోకుండా ఉండటానికి కొన్ని టూత్ పేస్టుల్లో కూడా ఫ్లోరైడ్‌ను కలుపుతారు. కాబట్టి పిల్లలు టూత్‌పేస్ట్‌లను మింగకుండా చూసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.