News March 22, 2024

ఇలా జరిగితే ముంబైదే IPL-2024 కప్పు!

image

మరికొద్ది సేపట్లో IPL-2024 టోర్నీ ప్రారంభం కానుండగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. IPL ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగితే ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందుతుందట. 2019 IPLలో ఇదే జరిగిందని చెబుతున్నారు. ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో RCB కేవలం 70 పరుగులే చేయడం గమనార్హం.

Similar News

News February 23, 2025

ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.

News February 23, 2025

వరుసగా 2 ఓవర్లలో 2 వికెట్లు

image

ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. ప్రమాదకరంగా మారిన రిజ్వాన్, షకీల్‌లను మనోళ్లు వెనక్కి పంపారు. వారిద్దరూ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్, హార్దిక్ వేసిన వరుస ఓవర్లలో ఔటయ్యారు. 2 క్యాచులు మిస్ అయినా పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం పాక్ స్కోర్ 35 ఓవర్లలో 160/4గా ఉంది.

News February 23, 2025

కాంగ్రెస్‌కు శశి థరూర్ రాం రాం చెబుతారా?

image

శశి థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల థరూర్.. మోదీ అమెరికా పర్యటన, కేరళలో పినరయి ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. కేరళలో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం కావాలని, లేదంటే మరోసారి విపక్ష స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తనకు ‘ఆప్షన్లు’ ఉన్నాయని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

error: Content is protected !!