News November 12, 2024
ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే మనకు మంచిదే!
US అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక H-1B వీసాలపై పరిమితులు విధిస్తే అది భారత్‌కు మేలు చేస్తుందని SBI నివేదిక అంచనా వేసింది. భారత్‌లో పెట్టుబడులు పెరగడం, దేశీయ ఉత్పాదకతలో సంస్కరణలకు బాటలు వేసి మోదీ 3.0 ఆత్మనిర్భర్ భారత్‌కు మేలు చేస్తుందని పేర్కొంది. అయితే, USలోని భారతీయ సంస్థలు స్థానిక టాలెంట్‌ను హైర్ చేసుకునేందుకు అధిక వనరులను వెచ్చించాల్సి వస్తుందని పేర్కొంది.
Similar News
News November 14, 2024
సక్సెస్ అంటే ఇదే!❤️
సక్సెస్ అంటే ఏంటని అడిగేవారికి బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి జర్నీని చూపించాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పట్నాలో తాను పనిచేసిన హోటల్‌కు ఇటీవలే వెళ్లినప్పుడు మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నారని పంకజ్ చెప్పారు. అప్పట్లో వెనుక గేటు నుంచి వెళ్లేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే హోటల్‌కు మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లానని, GM వచ్చి స్వాగతం పలికారని ఇదే విజయం అని ఆయన పేర్కొన్నారు.
News November 14, 2024
WI, IREతో IND జట్టు ఢీ.. షెడ్యూల్ విడుదల
వెస్టిండీస్, ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. డిసెంబర్ 15 నుంచి 27 వరకు వెస్టిండీస్‌తో 3టీ20లు నవీ ముంబైలో, 3 వన్డేలు బరోడాలో జరగనున్నాయి. 2025 జనవరి 10 నుంచి ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా మూడు వన్డేల సిరీస్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
News November 14, 2024
Instagram డౌన్
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. తాము లాగిన్ కాలేకపోతున్నామని, ఫొటోలు & వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నామని యూజర్లు ట్విటర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇన్‌స్టా యాజమాన్యం స్పందించలేదు. కొందరికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మీకూ ఇలా జరిగిందా?